డేంజరస్ స్టంట్స్ చేయడం ఇటీవల కాలంలో ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇదే కోవలో ఓ యువతి చాలా ఎత్తులో తాడు పట్టుకుని తొలుత వేలాడింది. అనంతరం అమాంతంగా గింగిరాలు తిరుగుతూ కిందికి దూకింది. కింద నదిలో పడబోయేంతలో పారాచూట్ ఓపెన్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ స్టంట్స్ చేసే తీరు చాలా భయంకరంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి.