నిద్రలేని రాత్రులు గడిపిన అబ్రహం లింకన్

593చూసినవారు
నిద్రలేని రాత్రులు గడిపిన అబ్రహం లింకన్
పుట్టుక నుంచీ పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చిన లింకన్‌ను జీవితకాలం అది వెంటాడుతూనే వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతూ మరణించిన తన అక్క సారాను తలచుకుంటూ లింకన్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. చదువులేనప్పటికీ వ్యాపారంలో రాణిద్దామనుకొన్నాడు. కానీ అదీ తీవ్ర నష్టాల్నే మిగిల్చింది. అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు. సవతి తల్లికి సొంత బిడ్డగా మారినా తండ్రికి మాత్రం క్రమేపీ దూరమవుతూ వచ్చాడు.