ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో MIM పార్టీ బరిలోకి దిగుతున్నట్లు తెలిసింది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా, 10-12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెలువడనున్నాయి.