ప్రపంచ శాంతిని కోరుతూ కేరళకు చెందిన ఇద్దరు యువకులు ఉత్తరభారతం నుంచి శబరిమలకు ఏకంగా 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర (223 రోజులు) పూర్తి చేశారు. కాసర్‌గోడ్ జిల్లా రామ్‌దాస్‌నగర్‌కు చెందిన సనత్‌కుమార్ నాయక్, సంపత్ కుమార్ శెట్టిలు 2024 మే 26న కేరళ నుంచి రైలులో బద్రీనాథ్‌కు వెళ్లారు. అక్కడ ఇరుముడి కట్టి శాంతిని కోరుతూ జూన్ 3న శబరిమలకు పాదయాత్ర ప్రారంభించారని ఆలయ అధికారులు తెలిపారు.