మహ కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమబ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. కాగా, ‘మహా కుంభమేళా’కు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమైంది. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజులపాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభమేళా జరగనుంది.