పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తుండగా ప్రమాదం (వీడియో)

77చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లగిరి కొండపై పెళ్లి ఉండటంతో పెళ్లి చూసుకుని ఇంటికి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్