నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అఘోరీ హల్‌చల్ చేసింది. ఆవుల లోడుతో వెళ్తున్న మూడు లారీలను అఘోరీ అడ్డగించింది. సరైన పత్రాలు చూపి ఆ తర్వాత వాహనాలను తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో లారీల నిలుపుదల చేశారు. పోలీసులు స్థానిక హిజ్రాల సాయంతో అఘోరీని అక్కడి నుంచి పంపారు.