ఆగస్టు నెలలో శాకాహార థాలీ సగటు ధర 8%, మాంసాహార థాలీ ధర 12% తగ్గాయి. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ వెలువరించిన ‘‘రోటీ రైస్ రేట్’’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గడం, థాలీలో ఉపయోగించే వంటనూనె ధర 6%, మిరపకాయలు 30%, జీలకర్ర 58%, బ్రాయిలర్ ధర 13% తగ్గడం దీనికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. 2023 ఆగస్టులో ఈ నాన్-వెజ్ థాలీ సగటు ధర రూ.67.5 ఉండగా.. ఈ ఏడాది రూ.59.3కు తగ్గింది.