Feb 22, 2025, 12:02 IST/
తెలంగాణ సచివాలయ కొత్త ప్రధాన ద్వారం సిద్ధం
Feb 22, 2025, 12:02 IST
తెలంగాణ సచివాలయ కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. గతంలోనూ చుట్టూ 4 ప్రధాన ద్వారాలుండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా మూసేసి గ్రిల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దాని పక్కనే కొత్త ద్వారం ఏర్పాటు చేశారు. ఈ ద్వారం ముందు వాహనాలు రాకపోకలు సాగించడానికి కొత్త తారు రోడ్డును సిద్ధం చేస్తున్నారు.