గుడ్ న్యూస్: నెలకు రూ.7,500?

84చూసినవారు
గుడ్ న్యూస్: నెలకు రూ.7,500?
ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2014 నుంచి నెలకు రూ.1000 పెన్షన్ వస్తుండగా.. దీనిని రూ.7,500కు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఫిబ్రవరి 28న భేటీ కానుంది. దాంతో ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్