ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఏకంగా 9 కేజీలు తగ్గాడట. ఈ విషయాన్ని షమీ స్వయంగా తెలిపాడు. భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూతో జరిగిన చిట్‌చాట్‌లో షమీ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘గాయం నుంచి కోలుకుని వచ్చేందుకు చాలా శ్రమించా, ఈ టోర్నీకి ముందు ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డా, ఈ క్రమంలో 9 కిలోలు తగ్గా’ అని షమీ తెలిపాడు.