తెలంగాణ పోలీస్ శాఖ అవసరాలు తీరుస్తామని DyCM భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో హోంశాఖ ప్రీబడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 'రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున HYDకి, రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయి. ఈ మేరకు భద్రత విషయంలో హోం శాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల్లో ఉండే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తాం' అని అధికారులకు హామీ ఇచ్చారు.