చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండగను ఆదిలాబాద్ జిల్లా వాసులు అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. పండగలో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మి దేవి పూజలను పట్టణంలో అత్యంత భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వ్యాపార వీధుల్లో ప్రత్యేక శోభా నెలకొంది. పూజా అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆకాశంలో తారాజువ్వలు మిరుమిట్లు గొలుపుతూ అందర్నీ ఆకట్టుకున్నాయి