ఆదిలాబాద్ పట్టణంలో భారీ చోరీ

55చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలో భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని పంజేశా కాలనీలో నివాసం ఉండే బొంబడిపల్లి నరేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 14న హైదరాబాద్ వెళ్లారు. గురువారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగిలి ఉండటం గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా 12 తులాల బంగారం, అర కిలో వెండి నగలు, రూ. 40 వేల నగదు, టివి కనబడలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలి ముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్