భక్తిశ్రద్ధలతో మోతీజీ మహారాజ్ పుణ్యతిథి వేడుకలు

537చూసినవారు
భక్తిశ్రద్ధలతో మోతీజీ మహారాజ్ పుణ్యతిథి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లోని సాంగిడి లో ఆధ్యాత్మిక గురువు మోతీజీ మహారాజ్ 26వ పుణ్యతిథి వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. భక్తులు నెత్తిపై కలశలతో గ్రామంలో సోమవారం ఊరేగింపు నిర్వహించారు. తుకుడోజీ మహారాజ్ ఆశ్రమంలో పూజలు చేసి, గ్రామ గీత పారాయణం పటిoచారు. వారం రోజులు పాటు ఈ వేడుకలు కొనసాగుతాయని భక్తులు తెలిపారు. కార్యక్రమంలో గురుదేవ్ సేవా భజన్ మండల్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్