ఆదిలాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమియత్ ఉలేమా ఎ హింద్ ప్రతినిధులు డీఎస్పీ జీవన్‌రెడ్డిని కోరారు. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక వినాయక్ చౌక్ వద్ద కలర్ ముగ్గులు విక్రయిస్తున్న మైనార్టీ యువకుల వ్యాపారాన్ని ధ్వంసం చేసిన, తీవ్ర నష్టం కలిగించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు