AP: చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. కోట్లాదిమందిలో క్రేజ్ ఉన్న వ్యక్తికి.. జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న మహిళకు మధ్య నడిచే పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్- షర్మిల ఆస్తుల వివాదం మధ్య వైఎస్ విజయమ్మ విడుదల చేసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే షర్మిలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఎంతో వైరల్ అయ్యాయి. ఇప్పుడు విజయమ్మను కూడా జగన్ అలా అనగలిగే ధైర్యం చేయగలుగుతాడా అని వైసీపీలో చర్చ నడుస్తోంది.