రోడ్డు గుంతలుగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారగా స్పందించిన ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించారు. అలాగే గాంధీనగర్ నుండి బోరిగామ వెళ్లే బీటి రోడ్డుపై ఉన్న గుంతలను మొరం వేసి పూడ్చారు. ఈ సందర్భంగా గుంతలను పూడ్చిన ఆటోనియన్ సభ్యులను ఆదివారం గ్రామస్తులు అభినందించారు. పోతారెడ్డి, శంకర్, ఆశన్న, శ్రీనివాస్, మోహన్, తదితరులు ఉన్నారు.