బజార్హత్నూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఎర్నోళ్ల నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా సూది వినాయక్, ఓర్నీ సంతోష్, కార్యదర్శిగా చెట్ల వినీల్, కోశాధికారిగా ఓర్నీ రమణ, సభ్యులతో పాటు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.