చిన్నారి వైద్యానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం

75చూసినవారు
చిన్నారి వైద్యానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం
ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామానికి చెందిన అల్లెం రాములు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఆయన కుమార్తె అల్లెం రమకుమారి చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు సభావత్ శ్రీనివాస్ విజయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ నాయక్ ను సంప్రదించారు. దీంతో ఆయన స్పందించి చిన్నారి వైద్యానికి ట్రస్ట్ ఆధ్యర్యంలో రూ. 50 వేలు గురువారం అందించారు. మనసున్న మహారాజులు స్పందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్