గుడిహత్నూర్ మండలం లింగపూర్ గ్రామంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి యేటా అఖండ హరినామ సప్తాహ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. దేవుని దయతో గ్రామానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తొందరలోనే పూర్తి చేసేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.