జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటీమ్స్ పనిచేస్తున్నాయని షీ టీం ఇంచార్జ్ వాణిశ్రీ తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని వివేకనంద డిగ్రీ కళాశాలలో షీటీం సేవలపై సిబ్బందితో కలిసి విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే భయపడకుండా షీటీం ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.