అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగామ కే గ్రామపంచాయతీ పరిధిలోని ఓ మద్యం దుకాణం (వైన్‌షాపు)లో చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి సమయంలో మద్యం దుకాణంలోకి చొరబడ్డారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదును, మద్యం బాటిల్లతో ఉడాయించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది.