తలమడుగు: బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత
తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన శంకరమ్మ ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు మానవతావాదులు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. సదరు కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా నిత్యావసర సరకులను అందచేసి మంగళవారం బాధితులకు ధైర్యం కల్పించారు.