ఆదిలాబాద్: రేపటి ప్రజావాణి రద్దు
రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 28న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.