చెన్నూరులోని కుమ్మరి కుంట చెరువు సర్వే నెంబర్ 971లో సర్వే కొనసాగుతోంది. ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్, తహసిల్దార్ మల్లికార్జున్, ఇరిగేషన్ డిఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 16. 24 ఎకరాల శిఖం భూమి హద్దులను గుర్తించేందుకు పాయింట్ టు పాయింట్ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే చేస్తుండడంతో చెరువు పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది. భూమి హద్దులను గుర్తించేందుకు మరి కొంత సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.