బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం గురు మదనానంద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి విజయరామరాజు, ఆలయ వైదిక బృందం, భక్తులు పాల్గొన్నారు.