రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలక నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుందని మంగళవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు లోకి 1, 174 క్యూసెక్కుల వరద నీరు రాగా, ఒక గేటును తెరిచి 1, 174 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 358. 70 కాగా ప్రస్తుతనీటిమట్టం 358. 70 కొనసాగుతుందని తెలిపారు.