రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం నర్సాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్(జి)కి చెందిన ఉజిగిరి గణపతి, అవుల్దాపూర్ కు గంగారెడ్డి వాకింగ్ కోసం నసిరాబాద్ వైపు వెళ్తుండగా మెట్పల్లికి మండలానికి చెందిన అబ్దుల్ రహమాన్ కారుతో వారిని ఢీకొట్టాడు. గాయపడ్డవారిని 108లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిరణ్ తెలిపారు.