వరదల్లో చిక్కుకొని 12 గొర్రెలు మృతి

57చూసినవారు
వరదల్లో చిక్కుకొని 12 గొర్రెలు మృతి
సారంగపూర్ మండలం స్వర్ణ వాగు వరదల్లో చిక్కుకొని 12 గొర్రెలు మృతి చెందిన ఘటన శనివారం కాల్వలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుర్మే రాజన్న తన గొర్రెల మందను మేపేందుకు సమీపంలో ఉన్న స్వర్ణ వాగు పరివాహక ప్రాంతానికి వెళ్ళాడు. నీరు తాగేందుకు వాగులోకి దిగిన గొర్రెల మంద వరదలో చిక్కుకుంది. అందులో 12 గొర్రెలు కొట్టుకుపోయి మృతి చెందగా, మిగతావి ఒడ్డుకు చేరినట్లు బాధితుడు తెలిపాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్