కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేయడం జరిగిందని తెలిపారు. వెంటనే వాటిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఎఐటియుసి జిల్లా నాయకులు పాల్గొన్నారు.