రైతులు సోయా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొయా కొనుగోళ్ల ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. క్వింటాలకు 4, 892 మద్దతు ధర ఉందని 12 శాతం తేమతో తమ పంటను మార్కెట్ కు తీసుక రావాలని కోరారు.