ఆదిత్య-L1 భారత్ కోసం మాత్రమే కాదు: ఇస్రో ఛైర్మన్

76చూసినవారు
ఆదిత్య-L1 భారత్ కోసం మాత్రమే కాదు: ఇస్రో ఛైర్మన్
భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-L1 విజయవంతం అయిన సందర్బంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్ కేవలం భారతదేశం కోసమే కాదని, ఇది యావత్ ప్రపంచం కోసం ప్రయోగించబడిందని అన్నారు. ఈ మిషన్ శాస్త్రీయ ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :