ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానుంది.