వాట్సాప్ ఓపెన్ చేయగానే రౌండ్ షేప్‌లో ఉన్న ఒక ఐకాన్ కనిపిస్తోంది. ఆ సింబల్‌పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది. అయితే ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం అందరి యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు మెటా తెలిపింది