సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాలేంటో చెప్పిన ఎయిమ్స్ డాక్టర్

79చూసినవారు
సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాలేంటో చెప్పిన ఎయిమ్స్ డాక్టర్
మనం తినే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలో దిల్లీ ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ డా.ప్రియాంక సెహ్రావత్ సూచించారు. డీప్ ఫ్రైడ్ స్నాక్స్ కాకుండా బాదం, పిస్తా లాంటి నట్స్, గుమ్మడి, ఫ్లాక్స్ విత్తనాలు తీసుకోవాలన్నారు. వంటల్లో ఆవ నూనె వాడాలని సూచించారు. పండ్ల జ్యూస్ ల బదులు నేరుగా పండ్లు తినాలన్నారు. జామ్, సాస్, కెచప్ కంటే కొత్తిమీర చట్నీ మేలని తెలిపారు. చక్కెరను బెల్లంతో రీప్లేస్ చేయాలని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్