ఎయిర్ ఇండియా కొత్త సదుపాయం

74చూసినవారు
ఎయిర్ ఇండియా కొత్త సదుపాయం
ఎయిరిండియా విమానయాన సంస్థ ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణానికి టికెట్ల ధరలను రెండ్రోజుల పాటు లాక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా విమాన టికెట్ ధరలు మారకుండా ప్రయాణికులు తమ ట్రిప్‌ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్