హైదరాబాద్ వాసులకు అలర్ట్

1087చూసినవారు
హైదరాబాద్ వాసులకు అలర్ట్
హైదరాబాద్ మహానగరంలో ఈనెల 28వ తేదీ ఆదివారం రోజున సింహవాహిని అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టారు. వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్