తెలుగు హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్ సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.100 నోట్లపై అల్లు అర్జున్ ముఖం ఉన్న నోట్లు వైరల్ అవుతున్నాయి. గాంధీజీకి బదులు పుష్పరాజ్‌ని పెట్టి కొంతమంది అభిమానులు ఫొటోలు షేర్ చేశారు. వీటిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.