వంట గది.. పంట చేలు.. షాపింగ్ మాల్స్.. ఆస్పత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్ బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే. సహజంగా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. పంట చేనులో ఎండిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను కాల్చి వేస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాలికి నిప్పురవ్వలు ఎగిరి సమీపంలో ఉన్న గడ్డివామి లేదా ఇంటిపై పడితే పెను ప్రమాదం సంభవిస్తుంది.