సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. చిక్కడపల్లి పీఎస్ కు హాజరైన ఆయనను డీసీపీ, ఏసీపీ, సీఐ ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తాము ఆయనకు చెప్పామని పోలీసులు వెల్లడించగా, తనకు చెప్పలేదని ఆయన ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు. దీనిపై ప్రధానంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విచారణను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.