టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. అల్లు అరవింద్ మనవడు రామకృష్ణ తేజ్, సాయి సంజన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కుమారుడే ఈ రామకృష్ణ తేజ్. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.