అస్సాంలో వరద పరిస్థితి ఆదివారం కొంచెం మెరుగుపడింది. అయితే ఇప్పటికీ 10 జిల్లాల్లోని 1.30 లక్షల మంది ప్రజలు వరద ముంపులోనే ఉన్నారని అధికారులు తెలిపారు. కమ్రూప్, మోరిగావ్, దిబ్రూగర్, శివసాగర్, గోలాఘాట్, నాగావ్, ధేమాజీ, గోల్‌పరా, కమ్రూప్ మెట్రోపాలిటన్, కాచర్ జిల్లాలు ప్రభావితమయ్యాయన్నారు. ఈ సంవత్సరం వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 113కి చేరుకుంది.