జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో హిమశిఖరాల మధ్య, సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గుహ. ఏడాది మొత్తంలో కొద్ది రోజుల పాటు మాత్రమే దర్శనిమిచ్చే ఈ శివయ్యను దర్శించుకోవడం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర 52 రోజుల అనంతరం శ్రావణ పూర్ణిమ (సోమవారం) నాడు ముగిసింది. ఈ యాత్రలో ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా యాత్రికులు పాల్గొన్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.