జున్నులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. జున్ను తినటం వల్ల శరీరానికి ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి12 పుష్కలంగా అందుతుంది. దీనిలోని పోషకాలు శరీర కణాల నిర్మాణానికి సహాయపడుతాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో అధిక వేడి తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. జున్నుని మితంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.