ఝార్ఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను గుర్తించి, తరిమేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్న చొరబాటుదారుల పేరుమీదకు భూమి బదలాయింపును నిరోధించేలా చట్టాన్ని తీసుకువస్తామన్నారు. మన అమ్మాయిలను పెళ్లి చేసుకొని, చొరబాటుదారులు భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. అలాగే వారిని గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.