చాలా మంది పవిత్ర స్థలాలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి గంగాజలాన్ని తెచ్చుకుంటారు. అయితే గంగాజలాన్ని తెచ్చుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. గంగాజలాన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్లో పెట్టకూడదు. ఇంటికి తీసుకుని రాగానే బాటిల్లోని గంగాజలాన్ని ఇత్తడి, కంచు, రాగి వంటి పాత్రల్లో పోసి మాత్రమే నిల్వ చేయాలి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత గంగాజలాన్ని ఇల్లంతా చల్లితే.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.