మరో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

78చూసినవారు
మరో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై సావనూర్ నుంచి యల్లాపూర్ వెళ్లున్న లారీ 50 మీటర్ల లోయలో పడింది. ఘటనలో గాయపడిన 10 మందిని హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో మంత్రాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్