నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో ఓ మ్యాన్‌హోల్ మూతను బాలయ్య బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌గా ఉపయోగిస్తారు. అయితే మ్యాన్‌హోల్ మూత నిజంగానే బుల్లెట్ ప్రూఫా?.. కాదా?.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. పలు రకాల తుపాకులతో మ్యాన్‌హోల్ మూతను షూట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.