స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ లాంచ్ చేసింది. ఎస్‌బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ పేరుతో ఒక కొత్త ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ జనవరి 20న ప్రారంభమై జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్‌వెస్ట్ చేయవచ్చు. కనీస అదనపు కొనుగోళ్లు రూ.1000 నుంచి మొదలవుతున్నాయి.